అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుదేరింది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు […]
Archive | Short Stories
Simhamu – Eluka (సింహము – ఎలుక)
అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పాహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా […]
Pamu – Sneham (పాము – స్నేహం)
అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక బైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది. ఆ వణుకుతున్న పామును చూసి ఆ బైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు. జాలితో ఆ బైతు పామును తన ఛాతీ దగ్గరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది. వెంటనే పాము తన అసలు స్వభావము […]
Premalo Padda Puli (ప్రేమలో పడ్డ పులి)
అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది. కొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి […]
Addamlo Manishi (అద్దంలో మనిషి)
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు. వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది. ఒక […]
Athyasagala Kukka (అత్యాశగల కుక్క)
అనగనగా ఒక కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారిలో ఒక నది వుంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది. “ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క వుంది, అది […]
Palleturi Eluka, Pattanam Eluka (పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక)
ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయినా తన దగ్గర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. […]
Mullu Poyi Katti Vacche Dam Dam Dam (ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం)
ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. “ఓ కోతి! ఓ కోతి! నా కత్తి!” అన్నాడు. కోతి వెనక్కి తిరిగి, “ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం”, అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం […]
Agnanam, Murkhatwam (అజ్ఞానం, మూర్ఖత్వం)
అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది. ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. […]
Nirakshara Kukshi (నిరక్షర కుక్షి)
అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు. దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు. ఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క ఎండ, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్టలేకపోయాడు. జమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. […]