Pamu – Sneham (పాము – స్నేహం)

picture21అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక బైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది.

ఆ వణుకుతున్న పామును చూసి ఆ బైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు.

జాలితో ఆ బైతు పామును తన ఛాతీ దగ్గరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది.

వెంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ బైతును కాటువేసింది. పాపం ఆ బైతు పాముకాటుకి మరణించాడు.

దుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు.

No comments yet.

Leave a Reply